నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మధ్యాహ్నం 12.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు అక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు చిత్తూరు సబ్ జైలు కి చేరుకుంటారు. కుప్పం అన్న క్యాంటిన్ పై వైసిపి దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్టయిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.45కి చిత్తూరు నగరంలోని నగర్ మాజీ మేయర్ కటారి హేమలత నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. కటారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించిన అనంతరం సాయంత్రం 6.30 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.
నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన
