గిరిజన ప్రాంతాలాలలో సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి – మంత్రి జోగి.రమేష్

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో నవరత్నాలు పేదలందరికి ఇళ్ళు పధకంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి.రమేష్ అధికారులను ఆదేశించేరు.సోమవారం శాసన సభ కమిటీ హాలు లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో అమలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణల పురోగతి పై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పీ.రాజన్న దొర,గిరిజన ప్రాంతాలుకు చెందిన శాసన సభ్యులు,గృహా నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజేయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి శ్రీ రాహుల్ పాండే , మేనేజంగ్ డైరెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా,ఇతర ఉన్నంతధికారులు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.గిరిజన ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలకు రహదారులు,కాల్వలు,విద్యుత్,మంచి నీరు తదితర సౌకర్యాల కల్పనకు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించేరు.గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు ఎదురవుతున్న సమస్యలను శాసన సభ్యులు మంత్రి దృష్టికి తేగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించేరు.ఇసుక,స్టీల్,ఇతర నిర్మాణ సామాగ్రి లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించేరు.గిరిజన ప్రాంతాలలో జగనన్న కాలనీల నిర్మాణల పురోగతిని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజేయ్ జైన్,మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా,ప్రత్యేక కార్యదర్శి శ్రీ రాహుల్ పాండే సమావేశం లో వివరించారు.

Leave a Reply

Your email address will not be published.