అమరావతి శాసనసభ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని గొప్పలు చెప్పి రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నాడు. చంద్రాబాబునాయుడు సంక్షేమాన్ని అందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించారు. జగన్ ఆసరా అని చెప్పి టోకరా వేశాడు. నాడు చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు ఎంతగానో సహాయం చేశారు. జగన్ తన సాక్షి పత్రికకు వేల కోట్లు దోచిపెడుతున్నాడు. ప్రచార ఆర్బాటాలకే డబ్బంతా తగలేస్తున్నాడు. ప్రజలలో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతన్నందున ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది.
జగన్ ఆసరా అని చెప్పి టోకరా వేశాడు – చినరాజప్ప టీడీపీ
