ఈ మూడు సంవత్సరాల్లో వైసీపీ సాధించిందేమీ లేదు – గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ

అమరావతి శాసనసభ : రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయాయి. ఈ మూడు సంవత్సరాల్లో వైసీపీ సాధించిందేమీ లేదు. జే ట్యాక్సులు వేసి ఇబ్బంది పెట్టారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతానికి గురిచేసి తరలివెళ్లేలా చేశారు. టీడీపీ ఐదు సంవత్సరాలపాటు కష్టపడి పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసింది. 15 లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వచ్చేలా ఎంఐఏలు కుదుర్చుకుంది.  వారికి కేటాయింపులు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వచ్చిన పరిశ్రమలు తరలిపోయాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం  2014-19 మధ్య 53 శాతం వృద్ధిరేటు పెరిగింది. 2020-21 వరకు -3.26. దీన్ని బట్టి పారిశ్రామిక విధానం పూర్తిగా దిగజారిపోయింది.  39,213 . మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఎల్ ఎంలు 217.  మొత్తం 39,450 పరిశ్రమల ద్వారా 5,13,351 మంది కి ఉద్యోగాలు ఇచ్చామని మోసపూరిత ప్రకటనలిచ్చారు.  తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఇలాంటి నాయకుడు అవసరమా అని మాట్లాడారు. మరి ఇదే ప్రాంతంలో చంద్రబాబునాయుడు కేపీఆర్ పరిశ్రమ తెస్తే దానికి ప్రస్తుతం లైసెన్సు ఎలా ఇచ్చారు?  ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలు చేశారు. నేడు ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజ బ్యాటరీస్, జువారీ సిమెంటును మూసివేసే ప్రయత్నాలు చేశారు. దీంతో పారిశ్రామివేత్తలు భయపడి తమ పరిశ్రమలను తరలించేస్తున్నారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏం సాధించారో చెప్పాలి. తెలుగుదేశం హయాంలో 65,307 కోట్లు ఎఫ్ డీ ఐ లు వస్తే వైసీపీ ఈ మూడున్నరేళ్లలో 2,114 కో ట్లు తెచ్చారు. ఉపాధి అవకాశాలు లేవు. పారిశ్రామికులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోవడంతో పరిశ్రమలు తరలిపోయాయి. అమర్ రాజ లీథియం బ్యాటరీస్, 17 కియా అనుబంధ సంస్థలు, ప్రకాశం జిల్లాలోని ఆసియా బల్బ్ ఫ్యాక్టరీ, విశాఖపట్నంలోని అదానీ పరిశ్రమ, రిలయన్స్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ, లూలూ గ్రూప్, బీఆర్, హెచ్ సీఎల్, ఐబీఎం, హెచ్ ఎస్, బీసీ, ఏసియన్ బ్యాంక్ లు తరలిపోయాయి. విశాఖ రుషికొండలో ఐటీ టవర్స్ నిర్మాణం చేస్తుంటే దాన్ని ఆపేశారు. దీంతో 14 కంపెనీలు తరలిపోయాయి. గన్నవరం మేథా టవర్స్ పక్కకు వెళ్లిపోయింది.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కుదేలు చేశారు.  మూడు రాజధానుల ముచ్చట తెచ్చారు. కాకినాడ సెజ్ లో ఫార్మాకంపెనీలు రాకూడదని అడ్డు తగిలారు. నేడు అక్కడ హెటిరోకి ఏవిధంగా పర్మిషన్ ఇస్తున్నారు? కార్మికులందరూ వీధిన పడేలా చేస్తున్నారు. వచ్చే పెట్టుబడులు ఎందుకు తరలిపోయాయి? గ్రీన్ కో కు తెలుగుదేశం హయాంలో అనుమతి ఇస్తే దాన్ని రద్దు చేసి లంచాలు పుచ్చుకొని మళ్లీ ఇచ్చారు. నీ జే ట్యాక్సు వల్ల పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి. రిలయన్స్ కంపెనీల పెట్టుబడులు తరలిపోయాయి. వెనుకబడిన రాయలసీమకు వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పోతున్నాయి.  జగన్ కు రాష్ట్రంపై చిత్తశుద్ధి లేదు. మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. పర్యావసానంగా ఇండస్ట్రీస్ కుదేలైంది.  ఇసుక మాఫియాతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. రాష్ట్రం దివాళాతీసే పరిస్థితికొచ్చింది. అప్పులు తెచ్చి మన నెత్తిన భారం వేస్తున్నారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రాన్ని పారిశ్రామిక అంధాకంరలోకి నెట్టి నిరుద్యోగభృతి లేకుండా చేశారు. నిరుద్యోగులు ఉఫాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస కట్టారు.

Leave a Reply

Your email address will not be published.