ఈ తుగ్లక్ పాలనలో బతకడం భారమైంది : నిమ్మల రామానాయుడు టీడీపీ

అమరావతి శాసనసభ : రాష్ట్రంలో ఏ వీధి, గ్రామ, మండలానికి వెళ్ళినా బాదుడే బాదుడు అనే మాట వినిపిస్తోంది. మహిళలు, పేదలు, మధ్యతరగతి వర్గాల పక్షాన టీడీపీ అసెంబ్లీలో మాట్లాడదలిస్తే సహకరించలేదు. ప్రజలపై అప్పులు, పన్నులు తడిసి మోపెడౌతున్నాయి. శాసనసభ సజావుగా జరగడానికి తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎంతో సహకరించాం. కొశ్చన్ అవర్ జరగాలని అనేక విధాలుగా స్పీకర్ కు సహకరించాం. మేమిచ్చిన వాయిదా తీర్మానాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. మద్యపాన నిషేదంపై చర్చించదలిస్తే ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పేదలపై ఒక్క రూపాయి కూడ భారం మోపనని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పారు. ఇసుకపై, సిమెంటు, ఐరన్, లిక్కర్, నిత్యవసర సరుకులైన కంది పప్పు, ఉప్పు, మచినూనె పాకెట్, ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరుగుదొడ్లపై, వీధిలైట్లపై అన్నింటిపైనా బాదుడే బాదుడు. 7 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఆక్వారైతులకు అందే విద్యుత్ సబ్సిడీని ఎత్తేశారు. ఈ తుగ్లక్ పాలనలో బతకడం భారమైంది. గాలి, జుట్టుపై తప్పించి చెత్తపై కూడా ఈ చెత్తముఖ్యమంత్రి పన్ను విధిస్తున్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకి కార్యక్రమానికి వెళ్తుంటే చీపురు కట్ట తీసుకొని తిరగబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *